తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 26న ‘తలైవి’ చిత్రం విడుదల

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘తలైవి’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వి 2020 జూన్ 26న ఈ ‘తలైవి’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు ఎం.జి. రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తుండగా, మరో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారు.
ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్లుక్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు, తమిళ సినీ రంగంలో ఉత్తమ నటిగా పేరొందిన జయలలిత గొప్ప శాస్త్రీ నృత్య కళాకారిణిగా కీర్తి సంపాదించిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై ప్రస్తుతం షూటింగ్ జరుతోంది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ పరకాయప్రవేశం చేసిందా అనేంతగా నటిస్తూ వస్తోంది ఆదివారం చిత్ర బృందం విడుదల చేసిన లేటెస్ట్ లుక్ లో చుట్టూ పలువురు డాన్సర్లు నాట్యం చేస్తుండగా, మధ్యలో జయలలితగా కంగన నాట్యం చేస్తున్న తీరు చూస్తుంటే, కంగనా రనౌత్ శాస్త్రీయ నృత్యం పై ప్రత్యేక శ్రద్దతీసుకుని చేస్తున్న భంగిమ అమితంగా ఆకట్టుకుంటోంది.