ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మరక్కార్’

మోలీవుడ్ స్టార్ మోహన్ లాల్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మరక్కార్’. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం రిలీజ్ చేసి యూట్యూబ్‌లో పెట్టగా మంచి వ్యూస్ తో దూసుకెళ్తున్న దూసుకు పోతోంది. ఈ ట్రైలర్ వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ట్రయిలర్ అదుర్స్ అని యూనిట్‌ని అభినందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. మీ డ్రీం ప్రాజెక్ట్ ‘మరక్కార్’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ నటుడు మోహన్ లాల్, కెమెరా మ్యాన్ తిరు తో పాటు ఆ సినిమా యూనిట్ సభ్యులకు గుడ్ లక్ అని మహేష్ పేర్కొన్నారు.
16వ శతాబ్దం నాటి కుంజాలి మరక్కార్ అనే నావికుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా కళ్యాణి ప్రియదర్శన్, ప్రభు, సునీల్ శెట్టి, అర్జున్, సుహాసిని, జై, మంజు వారియర్ తదితరులు ఇటీవల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుందని యూనిట్ చెపుతోంది.