లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదు కేసును ఈ నెల 26కు వాయిదా

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు త‌న పాల‌నా స‌మ‌యంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టుకున్నారని దీనిపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశాలించాలంటూ  2005లో నందమూరి లక్ష్మీపార్వతి చేసిన ఫిర్యాదుపై  ఏసీబీ కోర్టు విచార‌ణ ఆరంభించింది,  ఈ కేసు ఇంకా ఫిర్యాదు ద‌శ‌లోనే ఉన్నందున‌ చంద్రబాబు న్యాయ‌వాదుల వాద‌న‌లు  వినాల్సిన అవ‌స‌రం లేదంటూ గతంలో ల‌క్ష్మీపార్వ‌తి చేసిన వినతిని కోర్టు ఆమోదించింది ఈ ఫిర్యాదు  విచారణ జరగకుండా  చంద్ర‌బాబు గ‌తంలో  హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు అందుకున్నా,  గతేడాది సుప్రీంకోర్టు   మధ్యంతర స్టే ఉత్తర్వుల గడువు ఆరు నెలకే కుదించ‌డంతో  స్టే ఆదేశాలు కొనసాగింపు ఉత్తర్వులు లేకుంటే  స్టే రద్దయినట్లేన‌ని భావించాల‌ని సూచించింది. 
ఈ క్ర‌మంలోనే   తన ఫిర్యా దుపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలనంటూ లక్ష్మీపార్వతి ఏసీబీ కు ఫిర్యాదు దాఖ‌లు చేసారు.    హైకోర్టు స్టే తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని, వాటినీ పరిశీలించాకే ఫిర్యాదుపై నిర్ణయాన్ని   తీసుకుంటామని ఏసీబీ కోర్టు   చెప్పింది.   ఈ నెల 26కు కేసును వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది .. 

Leave a Reply

Your email address will not be published.