యాదాద్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం

ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత మీడియాకు వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆమె గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆమె మాట్లాడుతూ..26న ఆరంభమయ్యే బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా మార్చి 3న ఎదుర్కోలు, 4న కల్యాణం, 5న రథోత్సవం కు పెద్ద ఎత్తు భక్తులు తరలి వస్తారని తెలిపారు. మార్చి 7న అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని చెప్పారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని, వేసవి తాపం సమీపిస్తుండటంతో చలువపందిళ్లు వేసామని చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.