26 లక్షల పేద కుటుంబాల పొట్టకొట్టారు : యనమల

ఏపీ సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. కార్డులు, పెన్షన్ల రద్దుతో 26 లక్షల పేద కుటుంబాల పొట్టకొట్టారని విమర్శించారు. పేదల పొట్టకొట్టి వైసీపీ ప్రభుత్వం మాఫియాను మేపుతుందని ఆరోపించారు. కార్డుల తొలగింపుతో రూ.1,500 కోట్లు.. పెన్షన్ల రద్దుతో రూ.2,512 కోట్లు ఎగ్గొట్టారని యనమల ధ్వజమెత్తారు.
సబ్ ప్లాన్ నిధులను ‘అమ్మఒడి’కి మళ్లించారని ఆరోపించారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని పేద మహిళలను మోసం చేశారని విమర్శించారు. వైసీపీ మాఫియా దెబ్బకు పాత ఇన్వెస్టర్లు పారిపోయారని ఎద్దేవా చేశారు. కొత్తవారు భయపడ్డారని తెలిపారు. 8 నెలల్లో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు పోయాయన్నారు. వాటాల కోసం బెదిరించడంతో ఇన్వెస్టర్లు వెళ్లిపోయారని యనమల విమర్శించారు.