మహేష్ 27వ చిత్రానికి కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలంటూ పట్టుపడుతున్న నమ్రతా …

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి బ్లాక్ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మొన్నటి వరకు ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడిపిన సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో హాలీ డే ట్రిప్‌ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.

తాజా సమాచారం మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ చిత్రంపై ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హల్‎చల్ చేస్తోంది. భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన భామ కియారా అద్వానీ. మహేష్ బాబు సరసన భరత్ అనే నేనులో నటించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి మహేష్ బాబు సరసన బంఫర్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’కి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఈ సూపర్‌స్టార్ 27వ చిత్రానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సమ్మర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త చిత్రం పట్టాలు ఎక్కనుంది. ఈ చిత్రానికి హీరోయిన్‌గా ఇంకా ఎవరు ఖరారు కాలేదు. కానీ నమ్రత మాత్రం ఈ చిత్రం కోసం కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలంటూ పట్టుపడుతుందటా.. దర్శకుడు వంశీ పైడిపల్లికి రికమండ్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. తన భర్తకు కియారా అద్వానీ అయితేనే సరైన జోడీ అని భావిస్తోందట నమ్రతా. అందుకే మరోసారి వీరిద్దరి కాంబోను సెట్ చేయాల్సిందిగా వంశీ పైడిపల్లికి నమ్రత సలహా ఇచ్చిందట. దీంతో మహేష్ 27వ చిత్రంలో కియారా అద్వానీ నటించడం ఖరారైనట్టేనని వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.