పింక్ సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాతే 27వ సినిమా

సినిమాల్లోంచి రాజ‌కీయాలకి అటునుంచి మ‌ళ్లీ సినిమాల్లోకి  రీ ఎంట్రీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్ప‌టికే వ‌రుస గా మూడు సినిమాల‌కు   గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసి షూటింగ్‌లు సైతం ఆరంభించేసి ముందుకెళుతున్నారు.  డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రంగా ఓ సినిమా  భారీ సెట్స్‌లో పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొంందుతోంది.  
కాగా ఈ చిత్రానికి తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పిల‌వ‌డ్డ పండ‌గ‌ల సాయ‌న్న జీవిత‌మే స్ఫూర్తిగా క్రిష్ క‌థ‌ని రూపొందించి  ఉన్న‌వారిని కొల్ల‌గొట్టి.. లేనికి పంచే పాత్ర‌ని సృష్టించాడ‌ని, ఈ చిత్రంలో కొన్ని క‌త్తి, మ‌ల్ల యుద్ధాలు కూడా  ప‌వ‌న్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 
కాగా ఈ సినిమా కోసం ప‌వ‌న్ కొత్త హెయిర్ స్టైల్‌తో సరికొత్త‌ లుక్‌లో క‌న‌ప‌డటంతో పాటు  చేతిపై టాటూ కూడా వేసుకున్నాడు.  ఈ సినిమా కోసం హైద‌రాబాద్ శివార్ల‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో భారీ సెట్స్ వేసి తెర‌కెక్కిస్తున్నారు.  పింక్ సినిమా రీమేక్    షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాతే ప‌వ‌న్ త‌న 27వ సినిమా  షూటింగ్‌లో  పూర్తి స్థాయిలో పాల్గొన్న‌బోతున్నాడ‌ని టాక్‌. ఈ సినిమాలో కియారా అద్వాని, వాణీక‌పూర్‌ల‌లో ఒక‌రు హీరోయిన్ కావ‌చ్చ‌ని తెలియ వ‌చ్చింది.  
 

Leave a Reply

Your email address will not be published.