27 నుండి పాలెం వెంకన్న బ్రహ్మోత్సవాలు…

నాగర్ కర్నూలు జిల్లా సమీపంలోని బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో గల శ్రీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 27 నుండి ఫిబ్రవరి 3 వరకు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మను సాని నరసింహ స్వామి గుప్తా , కార్యనిర్వాహణాధికారి ఆంజనేయులు తెలిపారు. ఈనెల 30న స్వామివారి కల్యాణోత్సవం,
ఫిబ్రవరి 1న రథోత్సవం(తేరు) ప్రత్యేక ఉత్సవాలుగా నిర్వహిస్తామని వివరించారు.
ఈ బ్రహ్మోత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఈనెల 27న సోమవారం రోజు స్వామివారికి అభిషేకం కోయిల్ అల్వార్ తిరుమంజనం,
28న ధ్వజారోహణం, గరుడ పొంగలి నివేదన, సంతానం లేని దంపతులకు ప్రసాద వితరణ
29న ప్రబంధ పారాయణం, హోమబలిహరణం, గరుడవాహన సేవ ఎదురుకోళ్ళు,
30న గురువారం రోజు ఉదయం 11గంటలకు శ్రీఅలివేలుమంగా వెంకటేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం,
31న, పల్లకిసేవ.
ఫిబ్రవరి 1న శనివారం నాడు రాత్రి 11గంటలకు రథసప్తమి, రథోత్సవం(తేరు),
ఫిబ్రవరి 2న ఆదివారం నాడు ఉద్దాల మహోత్సవం,
ఫిబ్రవరి 3న సోమవారం నాడు పుష్పయాగం, శేష వాహనసేవ, దేవతావిసర్జన, ఆలయంలో పండితులకు సన్మానం, ఉత్సవ సమాప్తి.
ప్రతిరోజూ పూజలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని ఈఓ కోరారు.