ఈ నెల 28 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 31న బడ్జెట్
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి  ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఏర్పాట్లు  పూర్తిచేయాలని.అసెంబ్లీ కార్యదర్శి కి స్పీకర్ త‌మ్మినేని సీతారాం ఆదేశాలు జారీచేశారు.   గవర్నర్ హరిచందన్  ఉభయసభలను ఉద్దేశించి ప్ర‌సంగించ‌డంతో బ‌డ్జెట్ స‌మావేశాలు ఆరంభ‌మ‌వుతాయి. ఈ నెల 31న ఆర్థికమంత్రి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. 28న బిఏసి ఏర్పాటు చేసి ఈ సమావేశాలు  ఎన్ని రోజులు నిర్వహించాలన్నది చర్చించనున్నార‌ని స్పీక‌ర్ కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

Leave a Reply

Your email address will not be published.