ఫిబ్రవరి 28న ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’ సినిమా విడుదల

మణిరత్నం ‘ఓకే బంగారం’, నాగ అశ్విన్‌ ‘మహానటి’ చిత్రాల‌లో న‌టించిన‌ దుల్కర్‌ సల్మాన్‌,  హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరో హీరోయిన్‌లుగా  నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’.  ఈ చిత్రాన్ని తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుద‌ల చేస్తోంది   కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్ సంస్ధ‌.  ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానున్న ఈ సినిమాని వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా  దేసింగ్‌ పెరియసామి దర్శకత్వం వ‌హించారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన 25వ చిత్రం కావ‌టం విశేషం.
కాగా మసాలా కాఫీ సంగీతం అందించిన సామ్రాట్‌ నాయుడు  బాణీలు స‌మ‌కూర్చ‌గా  పూర్ణాచారి సాహిత్యం అందించిన ‘గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే’ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్  
ఈ సంద‌ర్భంగా  దర్శకుడు దేసింగ్‌ పెరియసామి మాట్లాడుతూ ‘‘మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్‌ సిద్ధార్థ్‌గా ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించాడ‌ని.  మీరా పాత్రలో హీరోయిన్‌ రీతూ వర్మ నటించారు. ఆమెకు శ్రేయ అనే స్నేహితురాలు ఉంటుంది. మీరాతో సిద్ధార్థ్‌, శ్రేయతో కల్లీస్‌ ప్రేమలో పడతారు. లగ్జరీ లైఫ్‌ స్టైల్‌కు అలవాటు పడిన సిద్ధార్థ్‌, ఆత‌ని మిత్రుడు  కల్లీస్‌ ఏం చేశారు? వాళ్లు త‌మ పనుల కార‌ణంగా ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారు? అనేది చిత్రకథ. మలుపులతో ఆసక్తికరంగా ఉంటుంది ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ర్షించే అనేక అంశాలున్నాయ‌న్నారు.  
 

Leave a Reply

Your email address will not be published.