బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్లు

2020 బడ్జెట్‌లో కేంద్రం రైతులకు మంచి వార్త చెప్పింది నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 2.83 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2020-21 బడ్జెట్ లో వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత, గ్రామీణాభివృద్ధికి ఈ నిధులు దోహదపడతాయని ఆమె చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫసల్ బీమా పథకంతో దేశవ్యాప్తంగా 6.11 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల సహకారంతో బీమాను అమలు చేయనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.