ఫిబ్రవరి 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాహు’


కృతి గార్గ్, అభిరామ్ వర్మ హీరో హీరోయిన్లుగా  వ‌స్తున్న తాజా చిత్రం రాహు. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని  ఫిబ్రవరి 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు, ఈ  కార్య‌క్ర‌మానికి  న‌టి జీవిత రాజశేఖర్ నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ లు ముఖ్య అతిధులుగా వ‌చ్చేసారు.  


ఈ స‌మావేశంలో ద‌ర్శ‌కుడు  సుబ్బు వేదుల మాట్లాడుతూ…కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న మా రాహు మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు. మంచి సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.  


ముఖ్య అతిధి, ద‌ర్శ‌కుడు మధుర శ్రీధర్ మాట్లాడుతూ…  చిన్న సినిమా మ్యూజిక్ సక్సెస్ అవ్వడం అరుదుగా చూస్తూ ఉంటాం . ఈ సినిమాని జి తెలుగు వారు ఈ చిత్ర శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ తీసుకోవడం సురేష్ ప్రొడక్షన్స్ నుండి సురేష్ బాబు   విడుదల చేయడం ఇలా అన్ని పాజిటీవ్ థింగ్స్ కనిపిస్తున్నాయి, ఫిబ్రవరి 28న  విడుద‌లై సక్సెస్ అందుకుంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు.  


హీరోయిన్ కృతి గర్గ్ మాట్లాడుతూ….రాహు సినిమాలో ఇచ్చిన సుబ్బు గారికి ధన్యవాదాలు. ఒక మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది.   సాంగ్స్ వల్ల ఆడియన్స్ కు సినిమా బాగా రీచ్ అయ్యిందని తెలిపారు.


జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… మధుర శ్రీధర్   ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు, రాహు సినిమా ప్రోమోస్ చూశాను   డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తోన్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.


హీరో అభిరామ్ మాట్లాడుతూ… రాహు నా మొదటి సినిమా  ఆడియో   పెద్ద సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మా సినిమాను విడుదల చెయ్యడం ఇంకా సంతోషంగా ఉంది.   టెక్నీషియన్స్ అంద‌రికీ థాంక్స్  అన్నారు.

Leave a Reply

Your email address will not be published.