శర్వానంద్ 29వ చిత్రంగా రాబోతోన్న శ్రీకారం

శర్వానంద్ తనకంటూ ప్రత్యేక ఇమే‌జ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ప్రయోగాత్మకంగా ఉండే సినిమాలనే చేస్తు వస్తున్నారు. ఎంచుకొనే పాత్రల తీరుతో కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు శర్వానంద్. అయితే ఆమధ్య అతను చేసిన సినిమాలు సరైన విజయాన్ని ఇవ్వలేదు. అయినా ప్రేయోగాలకు వెనుకాడడం లేదు. అయినా సరే శర్వానంద్ సినిమా వస్తోందంటే.. ప్రేక్షకుల్లో కొత్త ఆశ చిగురిస్తుంది. ఈ మధ్య కాలంలో చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం సినిమాలు శర్వానంద్  సినీ జీవితానికి ఎలాంటి ప్రభావం చూపించలేదు.  అయితే అతనిలోని నటనను మాత్రం మెరుగుపర్చాయి. శర్వానంద్ తన వంతుగా వందశాతం ప్రయత్నించినా.. సరైన విజయాన్ని అందుకోలేదు. 
ప్రస్తుతం కొన్ని సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. తాజాగా సమంత, శర్వానంద్ జంటగా వస్తోన్న జాను రిలీజ్ డేట్ ఖరారు అయ్యింది.  ఫిబ్రవరి మొదటి వారంలో జాను వస్తోందని సమాచారం. శర్వానంద్ 29వ చిత్రంగా రాబోతోన్న శ్రీకారం సమాచారం కూడా వచ్చేసింది. ఈరోజు ఉదయం 9.45గంటలకు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇది ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.  లుంగీలో ఊరమాస్ లు‌క్‌లో ఆదరగొడుతున్నాడు. ఈ చిత్రానికి కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published.