గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ హీరోగా “చావు కబురు చల్లగా”

భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఆర్.ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం “చావు కబురు చల్లగా”. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. 2020లో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. ఎన్నో విభిన్నమైన పాత్రలో నటించిన కార్తికేయ ఈ మూవీలో బస్తీ  బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. 

దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రం గురుంచి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.

బ్యానర్ : GA2 pictures
సమర్పణ : అల్లు అరవింద్ 
నిర్మాత : బన్నీ వాసు 
సహ నిర్మాత : సునీల్ రెడ్డి 
డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి

Leave a Reply

Your email address will not be published.