నందిత శ్వేతా నటన ప్లస్ పాయింట్: ప్రేమకథా చిత్రమ్ 2

ప్రేమకథా చిత్రం సినిమా ఎంత హిట్ సాధించిందంటే.. అది మాటల్లో చెప్పలేం. అదేవిధంగా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ టీజర్ చూస్తుంటే.. మొదటి చిత్రమే భయంగా ఉందని అనుకున్నాం.. కానీ, దానికి మించిన విధంగా ఈ ప్రేమకథా చిత్రమ్ 2 కనిపిస్తోంది. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరికిషన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆర్‌పీఏ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో నందిత శ్వేత మెయిన్ హీరోయిన్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ ఎంత భయంకరంగా ఉంటుందో.. అంతే కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వుండనుంది. దీనికితోడుగా నందిత శ్వేతా నటన ఈ చిత్రంలో మరో ప్లస్ పాయింట్ అవుతుందని నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలానే మరో ఆకర్షణగా రావు రమేష్ కానున్నారని అన్నారు.

ప్రేమకథా చిత్రమ్ 2 పూర్తిగా రావు రామేష్ వాయిస్ ఓవర్‌తోనే నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక చిత్రాన్ని వచ్చే నెల అంటే.. మార్చి 21వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.