ఈ భామ రేటు 2 కోట్లా ? రవితేజ రిఫర్ చేస్తున్నాడట


మాస్ మహారాజ్ రవితేజ తెలుగు ఇండస్ట్రీలోకి కష్టపడి పైకి వచ్చిన హీరో అంటే మాస్ మహారాజ్ రవితేజ ఈ హీరోకి హిట్టు, ప్లాపులతో పని లేదు. ఏడాదికి మూడు సినిమాలు విడుదల చేసేవాడు. అయితే..అప్పుడు వరుస ప్లాప్స్ రావడంతో ఈ మాస్ మహారాజ్ రవితేజని ప్లాప్స్ కృంగదీశాయి. ఇక దీంతో ఏడాదికి రెండు సినిమాలే చాలనుకున్నాడు. ఈ సంవత్సరం  ‘డిస్కోరాజా’ తో డిజాస్టర్ అందుకున్న మాస్ మహారాజ్.. త్వరలోనే ‘క్రాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయ్యాక..రమేశ్ వర్మతో ఓ మూవీకి కమిటయ్యాడు మాస్ మహారాజ్ రవితేజ.

అయితే,..ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ. ఇప్పటికే టాలీవుడ్ లో టాప్ హీరోస్ తో చేసి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది కియారా అద్వానీ. అయితే రవితేజ సినిమాకు ఈ భామను రిఫర్ చేస్తున్నాడట దర్శకుడు. ఇటీవలే ఆమెను కలిసి స్క్రిప్ట్‌కు కూడా వినిపించాడట. ఆమెకు స్టోరీ నచ్చినప్పటికి ఏప్రిల్, మే వరకు డేట్స్ లేవు..అప్పటివరకు వెయిట్ చేస్తే చేస్తానని తెలిపిందట.

కానీ కియారా అద్వానీ పనిలో పనిగా రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసిందని వార్తలు గుప్పుమని వినిపిస్తున్నాయి. సినిమాలో మాత్రం 18 రోజుల కాల్షీట్లకు మాత్రమే ఇస్తానని అందట. ప్రస్తుతం కియారా ఉన్న రేంజ్‌ అలాంటిది. ఆమె చెప్పిన అమౌంట్‌కు దర్శకుడు పెద్దగా షాకవ్వలేదని సమాచారం ఫిల్మ్ నగర్ సమాచారం. కియారా-రవితేజ కెమిస్ట్రీ అయితే తన స్క్రిప్ట్‌కు కొత్తగా ఉంటుందని రమేశ్ వర్మ ఫీల్ అవుతున్నాడట. సినిమా ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉన్న నేపథ్యంలో..ఆయన మరికొన్ని ఆప్షన్స్‌ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వంశీ పైడిపల్లి-మహేశ్ బాబు సినిమా కోసం కియారాను సంప్రదించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.