ప‌వ‌న్ నాలుగో సినిమా గా ‘గోపాల గోపాల 2’


ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగు ఇండ‌స్ట్రీని ఊపేసే పేరు. ఈ మ‌ధ్య రాజ‌కీయాల‌లో ప‌డి సినిమాలు ఆపేసి, అటువైపే త‌న జీవితం అని ప్ర‌క‌టించుకున్న ప‌వ‌న్ పార్టీని న‌డ‌పాలంటే డ‌బ్బులు కావాల్సిందేన‌ని, త‌న‌కు తెలిసిందంతా న‌టించ‌డ‌మే క‌నుక తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో వ‌రుస సినిమాలు అంగీక‌రిస్తూ, వాటిని శ‌ర‌వేగంగా జ‌నం ముందుకు తీసుకువ‌చ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ప‌వ‌న్ చేసిన సినిమాల‌లో దాదాపు స‌గం సినిమాలు రీమేక్ సినిమాలే కావ‌టం విశేష‌మైతే… మ‌రోమారు మ‌రో రీమేక్‌కు ర‌డీ అవుతున్నాడు ప‌వ‌న్‌. గ‌తంలో గోపాల గోపాల, ‘కాటమరాయుడు’ చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డాలీతో మ‌రో సినిమా చేసేందుకు సై అంటున్న‌ట్టు స‌మాచారం. 

వెంక‌టేష్‌-ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల కాంబినేష‌న్‌లో , ‘ఓ మై గాడ్’కి రీమేకైన గోపాల గోపాల సినిమాకి సీక్వెల్ రాస్తున్నాడ‌ట‌ డాలీ. ఈ సీక్వెల్ స్క్రిప్ట్‌తో సహా పవన్ కళ్యాణ్ కి వినిపించి ఓకే చేసుకున్నాడ‌ట‌. అంటే ప‌వ‌న్ రీ ఎంట్రీ త‌రువాత వ‌చ్చే నాలుగో సినిమా గా ‘గోపాల గోపాల 2’ పట్టాలెక్కవచ్చ‌న్న‌ది ఇండ‌స్ట్రీలో ఓ టాక్ . గ‌తంలో హిందీ ‘దబంగ్ రీమేక్ గా ‘గబ్బర్ సింగ్ ని జ‌నం బాగానే ఆద‌రించారు. కానీ దానికి సీక్వెల్ గా వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీసు ముందు చుక్క‌లు చూసింది. మరి ‘గోపాల గోపాల’ సీక్వెల్ గా త‌గిన ఫ‌లితాన్ని అందుకుంటుందా? అన్న చ‌ర్చ జరుగుతోందిప్పుడు.

Leave a Reply

Your email address will not be published.