జీ తెలుగు ఫాంటసీ సీరియ‌ల్ “త్రినయని” మార్చి 2 నుంచి

అద్భుతమైన కథలు, అత్యద్భుతమైన సీరియల్స్‌, అంతకుమించిన రియాలిటీ షోస్‌తో తెలుగు ప్రేక్షకుల్నినాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తోన్న  జీ తెలుగు  ఇప్పుడు ఫాంటసీ కథాంశంతో   సరికొత్తగా త్రినయని అనే సీరియల్‌ని త్వరలో ప్రసారం చేయబోతోంది. సాధారణ జీవితాన్ని గడిపుతున్నే ఒక అమ్మాయికి.. గతం, భవిష్యత్‌, ముందే తెలిసిపోతూ ఉంటుంది.   ఎదుటివారి భవిష్యత్తుని చూడగలిగే తన శక్తిని సమాజహితం కోసం ఉపయోగించాలని అనుకునే అమ్మాయి త్రినయని పాత్రలో ఆషికా నటించింది. ఇందులో బిజినెస్‌ మాన్ విశాల్‌ వర్మ పాత్రలో చందు గౌడ నటించాడు.

మ‌రి అది ఆ అమ్మాయికి వరంగా మారిదా?, శాపమై ఇబ్బందుల‌కు గురిచేసిందా?  ఊహించ‌లేన‌న్ని ట్విస్టులు, ఎన్నెన్నో  అద్భుత స‌న్నివేశాల‌తో సాగే త్రినయని సీరియల్ కోసం అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ని ఉపయోగించారు. మార్చి 2, 2020 నుంచి ప్ర‌తి సోమవారం – శనివారం రోజూ రాత్రి 8.30లకు జీ తెలుగులో ఈ సీరియ‌ల్‌ ప్రసారం కాబోతున్న‌ట్టు జి తెలుగు ప్ర‌క‌టించింది.
 
ఇప్ప‌టికే ఈ సీరియ‌ల్‌కి సంబంధించి,  సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు   ప్రేక్షకులకు తనదైన స్టైల్లో వివరించిన  విలక్షణమైన కాన్సెప్ట్‌ వీడియో ప్ర‌సార‌మ‌వుతోంది. ఇందులో ఎనర్జిటిక్‌ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు, త్రినయని పాత్రలో నటించిన ఆషిక గోపాల్‌ పదుకునే ఈ వీడియోలో  ఈ వీడియోలో ఉన్నారు.  అతేంద్రీయ శక్తులు, వాటి తాలూకూ సంఘటనలు ప్రేక్షకుల్ని ఎప్పుడు ఉత్కంఠ భ‌రితంగా త‌రువాత ఏం జ‌రుగుతుంద‌నేలా  ప్రతీ పాత్ర, ప్రతీ సంఘటన, ప్రతీ మలుపు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపేలే సీరియ‌ల్ రూపొందించారు
  
ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కాబోతున్న త‌రుణంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో  ఆషికా గోపాల్‌ పదుకునే మాట్లాడుతూ.. “నాకు ఈ పాత్ర చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నాయి. ఈ సీరియల్‌ ద్వారా అందరికి ఒక్క సరికొత్త రూపంలో కనిపించబోతున్నా. ఈ క్యారెక్టర్‌ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను.”
 
ఈ సందర్భంగా చందు గౌడ మాట్లాడుతూ.. “ఈ జానర్‌ నాకు పూర్తిగా కొత్తది. నేను ఈ షోలో భాగం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఒక భాగం అవ్వాలని అనుకుంటున్నాను. అందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి.” అన్నారు.  అద్భుతమైన కథ, అంతకుమించిన స్క్రీన్‌ప్లే, విజువల్‌ ఎఫెక్ట్స్ తో రూపొందించిన త్రినయని అందరిముందుకు రాబోతుందని చెప్పారు.  ప్రతీ పాత్ర మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published.