భారతీయుడు 2 సెట్లో ప్రమాదం, ఇద్దరు మృతి శంకర్ కళ్లకి గాయం

ఎస్.శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ డబుల్ రోల్లో నటించిన ‘భారతీయుడు’ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. 1996లో విడుదలైన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. 2.0 వంటి సూపర్
హిట్ చిత్రం తర్వాత శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
శరవేగంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతున్న తరుణంలో అనూహ్యంగా బుధవారం చిత్ర షూటింగ్ స్పాట్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి షూటింగ్లో పైన కట్టిన భారీ లైట్ తాడు తెగిపోవటంతో కిందనున్న యూనిట్‌పై పడింది. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు అక్కడికక్కడే మృతి చెందగా , శంకర్ కళ్లకి గాయం అయినట్టు సమాచారం అందుతోంది. ఈ వివరాలను చిత్ర యూనిట్లో పనిచేస్తున్న ప్రశాంత్ రంగస్వామి తన ట్విట్టర్ ఖాతాలో పెట్టడంతో బైటకొచ్చింది. ప్రస్తుతం శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.