భార‌తీయుడు – 2 చిత్ర షూటింగ్ ప్ర‌మాదం పై క‌మ‌ల్ హాస‌న్‌ స్పందన

నిన్న రాత్రి భార‌తీయుడు – 2 చిత్ర షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదంలో ముగ్గురు మ‌ర‌ణించ‌డ‌మై, చిత్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, చిత్ర నిర్మాణ సంస్ధ  లైకా ప్రొడక్షన్స్ స్పందించాయి.    

ట్విట్టర్ వేదికగా  కమల్‌హాసన్   స్పందింస్తూ,  షూటింగ్‌లో హ‌ఠాత్తుగా జ‌రిగిన ఈ ఘటన నా మనసును కలిచివేసింది. నాతో అన్యోన్యంగా ఉన్న ముగ్గురు  సహాయకులను క‌ళ్లెదుటే కోల్పోవడం బాధాకరంగా ఉంది. నా బాధ కన్నా.. కుటుంబాల బాధ ఎన్నో రెట్లు ఎక్కువ. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని  తీవ్ర భావోద్వేగ‌మైన‌ ట్వీట్ చేయ‌గా 

లైకాప్రొడ‌క్ష‌న్స్ ఈ ప్ర‌మాదంపై స్పందించడానికి మాటలు రావట్లేదు.   మంచి పనితనం ఉన్న ముగ్గురు టెక్నిషియ‌న్స్  క్రిష్ణ, చంద్రన్, మధులను కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని ఓ ప్రకటనలో లైకా పేర్కొంది.
 
 

Leave a Reply

Your email address will not be published.