‘అరణ్మణై 3’లో రాశి ఖన్నా హీరోయిన్ అంట ….

హారర్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు సుందర్ సి.  అయితే అందమైన కథానాయికలతో దయ్యలుగా చూపించి మంచి మార్కులు కొట్టేశారు.  పాలకోవా బ్యూటీ హన్సికతో తమిళంలో ‘అరణ్మణై’ పేరుతో తెలుగులో చంద్రకళ పేరుతో ఈసినిమాను తీశాడు. ఇందులో సుందర్ సి మెయిన్ హీరో. 2014లో ఈ సినిమా వచ్చింది. తర్వాత రెండేళ్లకు సీక్వెల్ తీశారు. ‘అరణ్మణై 2’లో సిద్ధార్థ్, త్రిష జంటగా నటించారు. అందులోనూ సుందర్ సి మెయిన్ హీరో. ఇప్పుడు ఈ సినిమాకు మరో సీక్వెల్ తెరకెక్కించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు.  అయితే… ఇందులో త్రిష, హన్సిక లేరు. ఈసారి రాశి ఖన్నాను తీసుకున్నారు. 

‘అరణ్మణై 3’లో రాశి ఖన్నా హీరోయిన్. సినిమాలో నటిస్తున్నట్లు రాశి చెప్పారు.  రాశి ఖన్నా నటిస్తున్న మొదటి హారర్ సినిమా ఇది. ఆమె ఆర్య పక్కన కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇందులోనూ సుందర్ సీ హీరోగా నటిస్తారు. మొదటి రెండు సినిమాల్లో నటించిన ఆండ్రియా కీలక పాత్రలో కనిపిస్తారు. ఫిబ్రవరి మంత్ ఎండ్ లేదా మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.