స్ట్రీట్ డ్యాన్సర్స్ 3డి

వరుణ్ ధావన్ – శ్రద్ధా కపూర్ జంట డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి తెలిసిందే. ఏబీసీడీ 2 లో ఈ జంట డ్యాన్సులు కట్టి పడేశాయి. ఇప్పుడు ఏబీసీడీ సిరీస్ లో  మూడో సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో ట్విస్టు. తాజాగా శ్రద్ధ, ధావన్ నటిస్తున్న  ఇది ఏబీసీడీ 3 కాదు. పూర్తిగా వేరొక సిరీస్ అని  నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. స్ట్రీట్ డ్యాన్సర్ 3డి అనేది ప్రత్యేకించి ఓ సిరీస్ లా రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.  స్ట్రీట్ డ్యాన్సర్లుగా శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ ల లుక్ ని లేటెస్ట్ గా లాంచ్ చేశారు. పోస్టర్లు అద్భుతమైన లుక్ తో ఆకట్టుకున్నాయి. అలాగే టైటిల్ ని వరుణ్ ధావన్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశాడు.  రెమో డిసౌజా తెరకెక్కించిన ఏబీసీడీ 2లో వరుణ్ ధావన్ – శ్రద్ధా కపూర్ డ్యాన్సులు కుర్రకారును కళ్లు తిప్పుకోనివ్వలేదు. అందుకే ఈసారి స్ట్రీట్ డ్యాన్సర్ 3డిలో ఇంకే రేంజులో డ్యాన్సులు చేయబోతున్నారో? అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఏబీసీడీ 3 చిత్రం కూడా రెమో డి.సౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒకేసారి డ్యాన్స్ బేస్డ్ సిరీస్ లతో బాలీవుడ్ వేడెక్కిపోతోంది. ఇక శ్రద్ధా కపూర్ ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.