రేపు మధ్యాహ్నం 3గం లకు ఏపీ కాబినెట్ సమావేశం
సార్వత్రిక ఎన్నికలకు ముందు రేపు సాయంత్రం 3గంటలకు సెక్రటేరియట్ లో ఏపి కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు కొ్త్త పథకాలపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తరహాలో పంట పెట్టుబడి సాయం అందించే రైతు రక్ష పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైతు రక్ష కింద ఎకరాకి పదివేల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని రైతులతోపాటు కౌలు రైతులకు వర్తింపు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించిన విదివిధానాలను కేబినెట్ లో చర్చించి ఆమోదముద్ర వేయనుంది. అలాగే అసైన్డ్ భూములకు సంబంధించి 20ఏళ్ళు అనుభవంలో ఉన్న వారికి క్రయవిక్రయా లు చేసుకునే వీలు కల్పించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. మరోవైపు మహిళలను తమ వైపు తిప్పుకునేందుకు డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల వంతున ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనికోసం 9,600కోట్లు అవుతుందని అంచాన. వితంతులు, వృద్ధుల పెన్షన్లతోపాటు సామాజిక పెన్షలను రెండింతలకు పెంచిన ప్రభుత్వ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటు మరికొన్ని కొత్త పథకాలు ప్రకటనకు ఆమోదం లభించనుంది.
మరోవైపు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపైనా కేబినెట్ చర్చించనుంది. ఏఏ బిల్లులు ప్రవేశపెట్టాలనేదానిపై సుదీర్ఘంగా చర్చ జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను మూడు నెలలకే పరిమితం చేయాలా…లేక ఐదారు నెలలకు పెంచాలనేదానిపైనా కేబినెట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో కీలకమైన వర్గంగా ఉన్న ఉద్యోగులను ప్రశన్నం చేసుకునేందుకు నివాసస్థలాలను కేటాయించాలనే నిర్ణయంకు కేబినెట్ ఆమోదించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతోపాటు రాజధాని అమరావతిలో ఉద్యోగులకు నివాస స్థలాలు కేటాయించాలని సిఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీనికి కేబినెట్ ఆమోద్ర వేసే అవకాశం ఉంది. కాగా 11వ పిఆర్సీ నివేదిక వచ్చేందుకు సమయం ఉన్నందున మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ను ప్రభుత్వం వాయిదా వేసే అవకాశం ఉంది. మరోవైపు రెండు డిఏలు పెండింగ్ లో ఉండగా వీటికి తోడు ఈనెల ముగిస్తే మరో డిఏ ఇవ్వాల్సి వస్తుంది. దీంతో కనీసం ఒక డిఏ ను ఉద్యోగులకు ఇచ్చేందుకు కేబెనెట్ ఆమోద ముద్ర వేయనుంది.