ఏప్రిల్ 3న రాజ్ తరుణ్‌ సరికొత్త సినిమా

గత కొంతకాలంగా  యువ కథానాయకుడు రాజ్ తరుణ్‌కు సరైన విజయాలు అందడం లేదు. ఎన్ని ప్రేమకథలు చేసిన ప్రేక్షకులు తిప్పికొడుతునే ఉన్నారు. ఆయనను యూత్‌కు దగ్గర చేసింది ప్రేమ చిత్రాలే ఎక్కువ.. అయినా సరైన కథలను ఎంచుకోవడంలో ఈ హీరో తడబడుతున్నారు. తాజాగా వచ్చిన ఇద్దరి లోకం ఒకటే సినిమా కూడా సరైన విజయాన్ని ఇవ్వలేదు. దీంతో రాజ్ తరుణ్ డైలామాలో పడిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రంలో నటిస్తున్నాడు. 
ఈ సినిమాను శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధామోహన్‌ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హెబ్బా పటేల్‌, మాళవిక నాయర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా శనివారం ఈ చిత్రా ప్రీ లుక్ విడుదల చేశారు. ఇందులో కథనాయకుడు, నాయిక విభిన్న మైన లుక్‌లో కనిపిస్తున్నారు. ఫిబ్రవరి 10 ఉదయం 10.10ని.లకి ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.