జ‌న‌వ‌రి 30న విడుద‌ల కానున్న `డబ్‌శ్మాష్‌`పవన్ కృష్ణ, సుప్రజ, హీరో హీరోయిన్లుగా  జ‌బ‌ర్ద‌స్త్ ఫేం గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `డబ్‌శ్మాష్‌`  జ‌న‌వ‌రి 30న విడుద‌ల కానుంది.  వీత్రి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మించిన ఈ సినిమాకు కేశవ్ దేపూర్ దర్శకుడు. చిత్ర  ట్రైలర్ విడుదల కార్య‌క్ర‌మం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది.

ఈకార్య‌క్ర‌మంలో దర్శకుడు కేశవ్ దేపూర్ మాట్లాడుతూ – “  ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టు సౌక‌ర్యాలు స‌మ‌కూరిస్తే,  టెక్నీషియన్స్  అద్భుతంగా ప‌నిచేయ‌గ‌ల‌నేందుకు మా సినిమా ఉదాహ‌ర‌ణ. . ఒక లైన్ విని ఈ సినిమా చేసిన మా నిర్మాత సుబ్రమణ్యం గారికి థాంక్స్.  దాదాపు 20 నిమిషాలు వి ఎఫ్ ఎక్స్ చిత్ర విజ‌యానికి స‌హ‌క‌రిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు. స్టూడెంట్స్ మీద వచ్చిన  సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మా సినిమా స్టూడెంట్స్ చేసే డబ్ స్మాష్ ల వల్ల ఏం జరిగింది అన్నేదే ఈ సినిమా కథాంశం.  

గెటప్ శ్రీను మాట్లాడుతూ – ” దాదాపు పదకొండు ఏళ్ల క్రితం ‘తెలుగబ్బాయి’ సినిమా టైమ్‌లో  కేశవ మాస్టర్ పరిచయం, ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. నామిద న‌మ్మ‌కంతో ఓ మంచి పాత్ర ఇచ్చినందుకు ధ‌న్యవాదాలు అని చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published.