జూలై 30న క్రీడా నేపథ్యం ఉన్న సినిమా విడుదల

గత ఏడాది `ఎఫ్ 2`, `గద్దల కొండ గణేష్` చిత్రాల విజయాలతో మాంచి ఊపులో ఉన్న యువ హీరో వరుణ్ తేజ్. క్రీడా నేపథ్యం ఉన్న సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కాగా. ఈ సినిమా కోసం వరుణ్ బాక్సింగ్‌లో ఈ సినిమా కోసం ఓలింపిక్ బాక్సింగ్ విన్నర్ టోని జెఫ్రీస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నానని ఈ మధ్య చెప్పాడు కూడా.
రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్ధు ముద్ద, అల్లు వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండటంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది.
ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయం కావటంతో దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తుండగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మంజ్రేకర్ ఈ సినిమా హీరోయిన్గా ఎంపికైనట్టు సమాచారం. స్పోర్ట్స్ డ్రామాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.