హేమ ఆస్తులు 300 కోట్లు

లేడీ కమెడియన్‌ గా కోవై సరళ తర్వాత అత్యంత ప్రేక్షకాధరణ దక్కించుకున్న నటి హేమ. ఈమె గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాల్లో అడపా దడపా మాత్రమే కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఉన్న జోష్ త‌గ్గింది. ఈమెకు అవకాశాలు తగ్గాయి. అయినా కూడా మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌లో కీలక వ్యక్తిగా ఈమె కొనసాగుతోంది. ఇక హేమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. త్రివిక్రమ్‌తో గొడవ, పూరితో ఈమెకు ఉన్న అనుభందం గురించి మాట్లాడింది. అదే ఇంటర్వ్యూలో హేమ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చింది.

హేమ చేస్తున్న సినిమాలు కొన్నే అయినా కూడా భారీగా ఆస్తులు సంపాదించిందని, సినిమాలో ఈమె నటించినందుకు పది నుండి పాతిక లక్షలకు ఎక్కువ తీసుకునే అవకాశం లేదు. ఈమె పారితోషికం ఈమద్య కాలంలో మరింత తగ్గింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హేమ ఆస్తులు పెద్ద మొత్తంలో పెరిగాయని, ప్రస్తుతం హేమ ఆస్తుల విలువ 300 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. ఖరీదైన కార్లు మరియు బంగారం కూడా ఈమెకు భారీ మొత్తంలో ఉంది. పారితోషికం కూడా పెద్దగా రాకుండా ఇంత ఆస్తులు ఎలా సంపాదించారంటూ తాజాగా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది.

బయట ప్రచారం జరుగుతున్నట్లుగా తనకు 300 కోట్ల ఆస్తులు ఏమీ లేవని, కాకుంటే నాకు మొదటి నుండి కూడా ఆస్తులు ఉన్నాయని, నా తల్లి గారు బాగా ఉన్న వారు అవ్వడం వల్ల నాకు మొదటి నుండి కూడా బంగారం బాగానే ఉంది.. మాకు మొదటి ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, అందువల్లే మాకు ఇప్పుడు ఆస్తులు బాగానే ఉన్నాయని, అందుకే ప్రస్తుతం ఆస్తులు ఉన్నాయని చెప్పుకొచ్చింది. నా భర్త సినిమాటోగ్రాఫర్‌ అని, ఆయన బాగానే సంపాదిస్తున్నార‌ని చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published.