జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అశ్వద్ధామ


నాగ శౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అశ్వద్ధామ. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అశ్వద్ధామ మూవీ ఆడియో ఫంక్షన్ ఖమ్మంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగ శౌర్య మాట్లాడుతూ…. . మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో అశ్వద్ధామ సినిమాలో హీరో అదే చేస్తాడని, ఖమ్మంలో జరుగుతున్నఈ ఆడియో ఫంక్షన్ ను సక్సెస్ చెయ్యడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు చెప్పాడు. 

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ….నిర్మాతలకు హీరో నాగ శౌర్య కు అభినంద‌న‌లు చెపుతూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. 

హీరోయిన్ మెహరిన్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం, అశ్వద్ధామ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. . డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అదే తీశాడు, అందరూ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం కష్టపడి పని చేశారు, మీ అందరికి నచ్చుతుంది అన్నారు.

డైరెక్టర్ రమణ తేజ మాట్లాడుతూ….నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్స్ కు ధన్యవాదాలు. అశ్వద్ధామ సినిమాలో కొత్త నాగ శౌర్యను చూస్తారు. ఈ సినిమాకు నేను డైరెక్టర్ అయినందుకు గర్వంగా ఉంది అని ఆనందం వ్య‌క్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published.