మార్చి 31 వరకు అన్ని బంద్


ఓ వైపు క‌రెనా వైరస్‌  ప్రభావం అస‌లు రాష్ట్రంలో లేదు అని నిర్ధారిస్తున్న  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధ‌వారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది . క‌రోనా  మహమ్మారిని కట్టడిచేసేందుకు   విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించిన‌ట్టు ప్ర‌క‌టించింది. ఈమేర‌కు విద్యాశాఖ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో  గురువారం   నుంచి మార్చి 31 వరకు  రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ఇస్తున్న‌ట్టు విద్యాశాఖ కార్య‌ద‌ర్శి ప్ర‌క‌టించారు. 

స్థానిక సంస్ద‌ల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేద‌ని, ఇందుకు క‌రోనా కార‌ణంగా చూప‌డం స‌మేతుకం కాదంటూ గుర్రుగా ఉన్న జ‌గ‌న్ స‌ర్కారు  ఇప్పుడు ఆదే కార‌ణాల‌తో  విద్యాసంస్ద‌లపై ఆక్ష‌లు ఎలా విధించింద‌న్న వాద‌న సామాజిక మీడియాలో వినిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.