రైల్వే సంచ‌ల‌న నిర్ణ‌యం… 32 మంది పై ‘ముందస్తు’ వేటు

రైల్వేశాఖ వారి సంచ‌ల‌న నిర్ణ‌యం. ఉద్యోగుల ప‌ని తీరు పై `ముంద‌స్తు`వేటు విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.  వారి ప‌ని తీరు స‌క్ర‌మంగా లేని కార‌ణంగా 32 మంది అధికారుల‌ను `ముంద‌స్తు`ప‌ద‌వీ విర‌మ‌ణ‌పేరిట వారిని ఉద్యోగాల‌నుండి తొల‌గించ‌డం జరిగింది. స‌రైన ప్ర‌వ‌ర్త‌న, ప‌నితీరు స‌రిలేకుండా 50ఏళ్ల‌కు పైబ‌డిన ఉద్యోగుల‌కు ముందస్తు వేటు విధించింది.  ఇలా పనితీరు ఆధారంగా రైల్వేలో ముందస్తు పదవీ విరమణ చేయించడం అరుదు. ఇలాంటి నిర్ణ‌యం చాలా అరుదుగా తీసుకుంటుంటారు. ఇక మ‌రి ఇటీవల కాలంలో 2016-17లో ఇలానే నలుగురు అధికారులపై ‘ముందస్తు’ వేటు వేశారు.

ఒక మ‌ధ్య వ‌య‌సు దాటిన వారి పై ఎప్ప‌టిక‌ప్పుడు వారిప‌నితీరు పై  ప్ర‌భుత్వం స‌మీక్షిస్తుంటుంది. ఈ నేప‌ధ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌ర్వీసు ప్ర‌కారం ఎప్పుడూ జరిగేదేనని, ఇలా ముందస్తు పదవీ విరమణ చేయించడం అనేది అరుదుగా జరుగుతుందని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. పనితీరు కనబరచని ఉద్యోగులను తొలగించాలని రైల్వే బోర్డు ఇదివరకే అన్ని జోనల్‌ కార్యాలయాలకు ఈ ఏడాది జులైలో లేఖ రాసింది. ప్రస్తుతం రైల్వేలో 13 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను కుదించాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి కొనసాగింపుగా తాజాగా 32 మంది అధికారులపై ‘ముందస్తు’ వేటు వేయడం గమనార్హం.

ఇక‌పోతే ఇదిలా ఉంటే ఉద్యోగాలు దొర‌క‌డ‌మే చాలా క‌ష్ట‌మైన ఈ రోజుల్లో, ఉన్న ఉద్యోగాన్ని ఎంతో జాగ్ర‌త్త‌గా చేసుకోవాల్సిన స‌మ‌యంలో ప‌నితీరు స‌రిగా లేద‌ని వేటు విధించ‌డం అనేది చాల ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.  ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాల‌కు గ్యారెంటీ లేదు. అదే విధంగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కి కూడా గ్యారెంటీ లేకుండా పోతుందని కొంద‌రు భావిస్తున్నారు. అదే విధంగా ఒక వ‌య‌సు వ‌చ్చిన వారి ప‌ని తీరు మీద స‌మీక్ష చేసి వేటు విధించ‌డం జ‌రిగింది. అయితే గ‌త రెండేళ్ళ‌లో లేనంత ఎక్కువ మంది పై ఈ వేటు విధించ‌డం జ‌రిగింది.


Leave a Reply

Your email address will not be published.