ఫిబ్ర‌వ‌రి 4 నుండి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం….ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెండితెర పున‌రాగమ‌నానికి స‌ర్వం సిద్ద‌మై ఇప్ప‌టికే  బాలీవుడ్ చిత్రం `పింక్‌` సినిమా తెలుగు రీమేక్ కి ర‌డీ అయిపోయారు. సినిమా వార్త‌లు  రాన‌ప్ప‌టికీ ఆయ‌న షూటింగ్ మాత్రం సైలెంట్‌గా పూర్తి చేసేస్తున్నారు. తాజాగా  ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించ బోయే మ‌రో సినిమా   ఎ.ఎం.ర‌త్నం నిర్మిస్తుండ‌గా,  ఈ చిత్రం కోసం హైద‌రాబాద్  ప‌మీపంలోని  అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేశార‌ట‌.క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 4 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌.  ఈ చిత్రం తొలి షెడ్యూల్ లో ప‌వ‌న్‌తో సంబంధంలేని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. ఈ లోపు ప‌వ‌న్ `పింక్` రీమేక్‌లో త‌న పార్ట్‌ను పూర్తి చేసేసుకుంటాడ‌ని స‌మాచారం. పీరియాడిక‌ల్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో ప‌వ‌న్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. కాగా. ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ ను  హీరోయిన్ గా న‌టించ‌నున్న‌ట్టు విన‌వ‌స్తోంది.

Leave a Reply

Your email address will not be published.