డిసెంబర్ 4న “బ్రహ్మాస్త్ర” చిత్రం

బాలీవుడ్ లవ్ బర్డ్స్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ , హాట్ బ్యూటీ అలియా భట్ డిసెంబర్లో ఒకటి కానున్నారు. వీరు గత కొంత కాలంగా  విరహ గీతాలు పాడుకుంటున్నారు. వీరిద్దరు పలు సినిమాల్లోనూ రోమాన్స్ పండించి నిజ జీవితంతో ఒకటి కానున్నారు. ఇటు రణబీర్, అలియా సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరు తాజాగా నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

డిసెంబర్ 4న  ఈసినిమాను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం యూనిట్ సభ్యులు ప్రకటించారు. విడుదల అనంతరం వారు పెళ్లి భాజాలు మోగించనున్నారు.  ఇక అలియా బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ గంగూభాయి కథియవాడి చిత్రంతో పాటు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో కీలక రోల్ లో అలియా నటిస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ముద్దుల గుమ్మ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published.