40 బార్డర్ క్రాస్ చేసినా..

మహేష్  సుకుమార్ కాంబినేషన్‌లోని ‘1 –  నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది సోఫీ చౌదరి. ఈ బ్యూటీ టీవీ యాంకర్ గా, మోడల్ గా, నటిగా సుపరిచితం. అంతకుమించి ఐటెమ్ భామగానే ఎక్కువగా పాపులరైంది. అయితే ఈ బ్యూటీ ఓ ఎన్నారైగా బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ వరుస అవకాశాలు అందుకుని స్థిరపడింది. ఇకపోతే ముంబై ఫేజ్ 3 ప్రపంచంలో బెస్ట్ కాంటాకట్స్ ఉన్న బ్యూటీగానూ పాపులర్. షారూక్ ఖాన్ వైఫ్ గౌరీఖాన్, కరీనా, కరిష్మా వంటి టాప్ క్లాస్ ఫ్రెండ్షిప్ తో ఈ అమ్మడు అక్కడ పబ్బం గడిపేస్తోంది. నటిగా అంతంత మాత్రం అవకాశాలే ఉన్నా రకరకాల అపైన్ మెంట్స్ తో బండి నడిపించేస్తోంది. ఇక సోఫీ వయసు ఇప్పటికే 40 బార్డర్ క్రాస్ చేసింది. అయినా నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో వెబ్ ప్రపంచాన్ని ఒణికిస్తూనే ఉంది. ఇటాలియన్ నటి సోఫీ లారెన్ కి ఫ్యాన్ అయిన తన తండ్రి గారు తనకు ఆ పేరునే పెట్టేయడంతో దాంతోనే అలా పాపులారిటీ దక్కించుకుంది. ఇన్ స్టాలో ఫుల్ స్వింగులో ఉండే సోఫీ చౌదరి బికినీ లుక్, టూపీస్ అవతారంలోనే ఎక్కువగా దర్శనమిస్తుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఖాళీ. బాలీవుడ్ లో సినిమాలేవీ చేయడం లేదు. అయినా సెలబ్రిటీ వరల్ లో మాత్రం తన స్థానాన్ని అలా మెయింటెయిన్ చేస్తూ వాడి వేడిగా చర్చల్లోకి వస్తోంది. 1 నేనొక్కడినే పరాజయంతో ఈ అమ్మడికి ఇటువైపు నుంచి అవకాశాలు తలుపు తట్టలేదు.

Leave a Reply

Your email address will not be published.