రూ 430 కోట్ల విలువైన మందు తాగేశారు

కొత్త సంవత్సరం ఆట పాటలకే కాదు మందుకూ కొదవలేకుండా పోయింది. డిసెంబర్ నెల తెలంగాణ లో రూ 2250 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే చివరి రెండు రోజులలో ఏకంగా 430 కోట్లు రూపాయలు జరగటం విశేషం. పోలీసులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై నిఘా ఉంచడంతో పాటు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండటంతో ముందుగానే కొనేసుకున్నవారూ ఎక్కువే , ఇందుకు డిసెంబర్ 30వ తేదీ రాష్ట్రంలో రూ.250 కోట్ల అమ్మకాలు జరిగమే తార్కాణం. ఇయర్ ఎండ్ రోజు వైన్స్ దగ్గర రష్ ఎక్కువగా కనిపించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రూ.30 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేసినప్పటికీ 31వ తేదీ సాయంత్రం 5 గంటలకే రూ.150 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగటంతో పాటు సాయంత్రం నుంచి అమ్మకాలు మరింత పెరిగాయి. గతేడాది డిసెంబర్ 31వ తేదీ రూ.100 కోట్లకుపైగా అమ్మకాలు జరగగా, ఈ ఏడాది ఇది 50 శాతం కంటే ఎక్కువ కు పెరగటం గమనార్హం.