బీజేపీకి షాకిచ్చిన 44 ఏళ్ల యువకుడు.. హేమంత్ సోరెన్


జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో బీజేపీ నాయకత్వం స్పందించింది. ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ బీజేపీ ఓటమికి తనదే పూర్తి బాధ్య‌త వహించారు. ఇక ఈ విష‌యం పై బీజేపీ అధ్యక్షుడు, కేంద్రహోం మంత్రి అమిత్ షా స్పందించారు. జార్ఖండ్‌ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ట్వీట్ చేశారు. జార్ఖండ్‌ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీని ఇప్పటి వరకు ఆదరించినందుకు జార్ఖండ్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా ట్విట్ చేశారు. జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి పరిపాలన అందిచాలని కోరుతున్నామని ట్వీట్ చేశారు.

గిరిజనులకు అనుకూలంగా ఉండే కౌలు చట్టాలను సవరించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా హేమంత్ ఆందోళనలు చేపట్టారు. 70 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌కు మద్దతు పలికారు. రిటైల్‌గా మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ స్కూళ్ల విలీనాన్ని వ్యతిరేకించారు.

హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ మూడు పర్యాయాలు సీఎంగా పని చేశారు. కానీ మొత్తం పది నెలలు మాత్రమే అధికారంలో ఉన్నారు. కొంత కాలమే సీఎంగా పని చేసిన శిబు సోరెన్.. అవినితి ఆరోపణలను ఎదుర్కొన్నారు. అవకతవకలకు పాల్పడ్డారనే విమర్శలకు గురయ్యారు.హేమంత్ సోరెన్ తన తండ్రి నీడ నుంచి బయటకు రావడానికి కొంత సమయం పట్టింది. 2014 ఎన్నికల్లోనే హేమంత్ తనేంటో ఫ్రూవ్ చేసుకున్నారు. పట్నా హైస్కూల్‌లో చదువుకున్న హేమంత్.. రాంచీ బిట్‌లో నుంచి మెకానిల్ ఇంజినీరింగ్‌‌లో చేరారు. కానీ కుటుంబ సమస్యలు, రాజకీయ గందరగోళం కారణంగా ఆయన బీటెక్ పూర్తి చేయలేకపోయారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ వీడియో గేమ్స్ ఆడటం అంటే సోరెన్‌కు ఎంతో ఇష్టం. హేమంత్‌ ఎప్పుడూ సాదాసీదాగా ఉంటూ పార్టీ  ఎదుగుదలలో విశేష కృషి చేశారు. ఫలితాల నేపథ్యంలో ఆయన భార్యతో ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published.