`దండుపాళ్యం 4`

వెంకట్ మూవీస్ బ్యానర్‌పై కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న చిత్రం `దండుపాళ్యం 4`. ఈ సినిమా ప్రెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో
నిర్మాత వెంకట్ మాట్లాడుతూ – “దండుపాళ్యం 4`ని కొత్తవాళ్లతో చేశాం. నేను, డి.ఎస్.రావుగారు నటించాం. అలాగే అరుణ్ బచ్చన్, సంజీవ్‌కుమార్, బుల్లెట్ సోము, రంగాయన విఠల, స్నేహ, రాక్‌లైన్ సుధాకర్ ఇలా చాలా మంది సినిమాలో పనిచేశాం. ఆర్టిస్టులందరికీ 8 నెలలు పాటు నటనలో శిక్షణ ఇప్పించాం. వారికి హెయర్ కట్ చేయలేదు. మాసీ లుక్ గెటప్‌ను మెయిన్ టెయిన్ చేశాం. టైం తీసుకుని సినిమా చేశాం. డైరెక్టర్ కె.టి.నాయక్గారు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. నేను నవంబర్లోనే సినిమాకు సెన్సార్ కోసం అప్లయ్ చేశాం. అయితే సెన్సార్ సమస్య వచ్చింది. మాకు తెలిసిన సెంట్రల్ మినిస్టర్‌తో కూడా మాట్లాడాం. ఆ పనులు జరుగుతున్నాయి. సాధారణంగా సినిమాలో ఏ సీన్ అయినా అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పొచ్చు. సీన్స్ కట్ చేయమనో, మ్యూట్ చేయమనో, ట్రిమ్ చేయమనో చెప్పవచ్చు. దండుపాళ్యం మూడు భాగాలను లేని అబ్జక్షన్ మా సినిమాకు మాత్రం ఎందుకో తెలియడం లేదు. ఒప్పుకుంటే కట్స్ ఏం చేయాలో చెబుతా.. లేకుంటే రిఫ్యూజ్ చేస్తానని ఆయన అన్నారు. బేసిక్ స్టోరీలో ఏమైనా ప్రాబ్లెం ఉంటే రిఫ్యూజ్ చేయవచ్చు. కానీ ఏ అబ్జక్షన్ లేనప్పుడు ఎందుకు రిఫ్యూజ్ చేశారో తెలియడం లేదు. అడిగితే సెన్సార్ ఆఫీసర్ నుండి సమాధానం లేదు. సినిమాను మార్చిలో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ.. ఇప్పుడు రిఫ్యూజ్ చేయడం వల్ల ఆర్సి కి వెళ్లి తర్వాత ట్రిబ్యునల్‌కి కూడా వెళ్లాలి. కాబట్టి రిలీజ్ లేట్ అవుతుంది“ అన్నారు.
ముత్యాల రాందాస్ మాట్లాడుతూ – “దండుపాళ్యం పార్ట్ 1సినిమాకు సంబంధించిన నైజాం ఏరియాలో నేనే రిలీజ్ చేశాను. తర్వాత రెండు, మూడు భాగాలుగా చేశారు. మాస్ ఆడియెన్స్‌లో కొంత మంది సినిమాను బాగానే ఆదరించారు. నాలుగో భాగం మంచి కథతో తెరకెక్కించారు. సెన్సార్ ఆఫీసర్‌కి సినిమాను చూడకుండా రిఫ్యూజ్ చేసే అధికారం లేదు. చూడకుండా సినిమాను రిఫ్యూజ్ చేయడం సరైనది కాదు. మరి వెంకట్‌గారి సినిమాను ఎందుకు రిఫ్యూజ్ చేశారనే దానిపై మా వంతుగా సపోర్ట్ చేసి కర్ణాటక నిర్మాతల మండలిని, దక్షిణాది చలన చిత్ర నిర్మాతల మండలిని కూడా కోరుతాం“ అన్నారు.
బెనర్జీ మాట్లాడుతూ – “సెన్సార్ రిఫ్యూజ్ కారణంగా ఆగిపోయిన సినిమాలేవీ ఇప్పటి వరకు లేవు. సెన్సార్ ఆఫీసర్స్ రిఫ్యూజ్ చేయడానికి కారణాలను చెప్పాలి. దానికి తగిన విధంగా నిర్మాతలు ఆర్సి, ట్రిబ్యునల్‌కి వెళ్లొచ్చు“ అన్నారు.
దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ – “సినిమాను చక్కగా తెరకెక్కించాం. అయితే కారణాలు చెప్పకుండా సినిమాను తిరస్కరించడం ఎందుకో తెలియడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్‌కు ఏం కావాలో దాన్ని సినిమాలో అందించాం. ఆర్సి వెళ్లడానికి కారణాలు తెలియడం లేదు“ అన్నారు