5న సీఎం పర్యటన ను విజయవంతం చేయండి : మంత్రి శంకర్ నారాయణ

 పెనుగొండ మండలం,ఎర్రమంచి వద్ద గల కియా కార్ల పరిశ్రమలోఈనెల 5 వ తేదీన కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మని కార్యక్రమానికి  రానున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. కియా కార్ల పరిశ్రమ లో ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలలో చేస్తున్న పర్యటన ఏర్పాట్లను మంత్రి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ ఈనెల 5 వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కియా పరిశ్రమను సందర్శించి,పరిశ్రమలోని వివిధ విభాగాలను , కార్ల తయారీని పరిశీలిస్తారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కియా పరిశ్రమను తొలిసారిగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ను విజయవంతం చేయాలని,పటిష్టమైన  భద్రతాఏర్పాట్లను చేపట్టి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ:
*ఈనెల 5 న సీఎం వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటన షెడ్యూల్

ఈనెల 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం ఉదయం కియా కార్ల పరిశ్రమ ను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసుబాబులు పరిశీలించారు.ముందుగా కియా ఫ్యాక్టరీ ఆవరణలోని హెలిప్యాడ్ ను పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన భద్రతాపరమైనచర్యలపై ఎస్.పి తో కలిసి చర్చించారు. కియా పరిశ్రమ లోపల విఐపి హాల్ ను, సీఎం పరిశీలించనున్న కియా ప్లాంటులోని వివిధ విభాగాలను పరిశీలించారు. కియా లోని ప్రెస్ షాపు, బాడీ షాప్, పెయింటింగ్ షాపు, అసెంబ్లీ, ఇంజన్ షాపు, టెస్ట్ ట్రాక్ ను ముఖ్యమంత్రి,కొరియా గ్లోబల్ సి.ఈ.ఓ,కొరియన్ అంబాసిడర్ లతో కలిసి పరిశీలిస్తారని కియా సి.ఈ.ఓ థామస్ కిమ్ కలెక్టర్ కు వివరించారు. కియా సీఏఓ థామస్ కిమ్ ప్రతి విభాగం వద్ద తయారు కానున్న కార్ల విడిభాగలను గురించి కలెక్టర్, ఎస్పీలకు వివరించారు. కియా లో ముఖ్యమంత్రి పర్యటిస్తున్న విభాగాల వద్దచేపట్టనున్న పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు గురించి ఎస్పీ తో కలెక్టర్ చర్చించారు. కియా లోని ఆయా విభాగాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి పాల్గొనే గ్రాండ్ సెర్మనీ ప్రధాన వేదిక వద్ద జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. వి వి ఐపి, విఐపి, ప్రజా ప్రతినిధులు, మీడియా, డెలిగేట్స్ లతో పాటు ప్రధాన వేదిక వద్దకు ఎంతమందిని అనుమతిస్తున్నారు, ఏఏ ఏర్పాట్లు చేస్తున్నారని కియా ప్రతినిధులను వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కియా పరిశ్రమ కు ఎదురుగా నేషనల్ హైవే పక్కన ఇదివరకే ఏర్పాటుచేసిన హెలిపాడ్ ను వారు పరిశీలించారు.కియా పరిశ్రమ ప్రాంగణం లోని హెలిపాడ్ వద్ద ప్రజాప్రతినిధులు, ప్రజలు ముఖ్యమంత్రిని చూసేందుకు వస్తారు కనుకసెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా కియా పరిశ్రమఎదురుగా  నేషనల్ హైవే పక్కన ఉన్న హెలిప్యాడ్ వద్ద సి.ఎం.దిగుతారని, అక్కడే ప్రజాప్రతినిధులను కలుసుకుని కియా కు చేరుకుంటారని ,అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన భద్రతాఏర్పాట్లను గురించి ఎస్పీ, ఇతర అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కియా లో గ్రాండ్ సెర్మనీ లో పాల్గొన్న అనంతరం  ముఖ్యమంత్రి కియాప్రాంగణంలో  ఏర్పాటుచేసిన హెలిపాడ్ నుంచి పుట్టపర్తికి తిరిగి వెళ్లడం జరుగు తుందని ,పర్యటన ఆసాంతం ఎలాంటి లోటు పాట్లు లేకుండా తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన వారిలో పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి, ట్రైనీ కలెక్టర్ జాహ్నవి,కియా ప్రతినిధులు, పలువురు జిల్లాఅధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.