Untitled Post

మార్చి 5 సాయంత్రం 5.43 గంటలకుచేపట్టాలని నిర్ణయించిన జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగం సాంకేతిక అవాంతరాల వల్ల వాయిదా వేస్తున్నట్టు ఇస్రో తాజాగా ప్రకటించింది. బుధవారం సాయంత్రం సంస్ధ ఓ ప్రకటన మీడియాకు విడుదల చేస్తూ భారత్ ప్రయోగించనున్న అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహంగా జీఐఎస్ఏటీ-1 ని ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, అయితే సాంకేతిక కారణాల వల్లే ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఇస్రో తేల్చి చెప్పింది.
2,268 కేజీల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీయో స్టేషనరీ క్షక్యలో ప్రవేశపెట్టేందుకు జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్‌ను ఇస్రో ఎంపిక చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఈ ప్రయోగం వాయిదా పడిందని, మరిన్ని జాగ్రత్తలతో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఇస్రో అధికారులు తెలిపారు.. మళ్లీ ప్రయోగం ఎప్పుడు ఉంటుందని మరికొన్ని రోజులలో ప్రకటించనునన్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.