డిశంబ‌ర్ 5న 90 ఎంఎల్ తో కార్తికేయ సరికొత్త కిక్కు


‘ఆర్ఎక్స్ 100’  తో  తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తికేయ ప్రేక్ష‌కుల‌కు సరికొత్త కిక్ ఇవ్వడానికి  90 ఎంఎల్ సిద్దం చేస్తున్నాడు.  ఈ చిత్రంతో డిసెంబర్ 5న గ్రాండ్ గా  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
 నేహా సోలంకి హిరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకి కొత్త దర్శకుడు శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వం వ‌హిస్తున్నారు.  కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం  ప్రీ రిలీజ్ వేడుక ఇటీవ‌ల జ‌రిగింది.  ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా బిగ్ సీడీని లాంచ్ చేశారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులు సందీప్ కిషన్, జానీ మాస్టర్, రోల్ రిడా, తాగుబోతు రమేష్, విఠల్ రెడ్డి, రజిని త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published.