50 శాతం షూటింగ్ పూర్త‌యిన మ‌హాప్ర‌స్థానంఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై యువ కథానాయకుడు తనీష్ హీరోగా దర్శకులు జాని  రూపొందిస్తున్న స‌రికొత్త చిత్రం మహాప్రస్థానం. ఈ చిత్రంలో ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తుంగా, భానుశ్రీ మెహ్రా, రిషిక ఖన్నా ఇత‌ర పాత్రల్లో న‌టిస్తున్నారు. . ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలి అల్యుమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఈ షెడ్యూల్‌తో50 శాతం షూటింగ్ పూర్తయింది . ఈ సందర్భంగా సినిమా ప్రోగ్రెస్ ను వివ‌రించేందుకు చిత్రబృందం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసారు.  ఈ స‌మావేశంలో  దర్శకులు జాని మాట్లాడుతూ.. తనీష్‌, న‌టీనటులు, సాంకేతిక నిపుణులు ఇచ్చిన స‌హ‌కారంతోనే  అనుకున్నది అనుకున్న‌ట్టు చేస్తూ వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నామ‌ని, ఈ సినిమాలో  రెండు మూడు పాత్ర‌లు మిన‌హా   హీరో సహా ఉన్నవాళ్లంతా క్రిమినల్సే.  క్రిమినల్స్ మధ్య జరిగే ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీ గా రూపొందించిన  సినిమా చాలా బాగా వస్తోందద‌ని చెప్పారు.  శ్రీ‌శ్రీ మహాప్రస్థానం కి మా మ‌హా ప్ర‌స్థానంకి చాలా తేడా ఉంద‌ని చెప్పుకొచ్చారాయ‌న‌.  

హీరో తనీష్ మాట్లాడుతూ..   దర్శకులు జాని కథను  డిజైన్ చేసిన విధానం బాగుంది.  ఒక యజ్నంలా రాత్రీ పగలూ షూటింగ్ జ‌రుగుతోంది.  ప్రతి షాట్ రిహార్సల్ చేస్తూ నటిస్తుండ‌టంతో ఎలాంటి లోపాలు లేకుండా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది.  ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేసి..ఏప్రిల్ లో విడుదల చేయాలనుకుంటున్నాం. అని చెప్పారు. 

నాయిక భానుశ్రీ మెహ్రా మాట్లాడుతూ… ఇటీవలే నాకు పెళ్లయింది. అందుకే కొంత‌ విరామం త‌రువాత న‌టిస్తున్న చిత్రంఇది.  చాలా కీలకమైన పాత్ర. జ‌ర్న‌లిస్టుగా క‌నిపించ‌బోతున్నాన‌ని చెప్పారు.  

నాయిక ముస్కాన్ సేథీ మాట్లాడుతూ.. మహాప్రస్థానం ఆసక్తికరమైన కథ. డిఫరెంట్ మెథడాలజీలో  చిత్రీకరణ జరుగుతోంది. అమేజింగ్ యాక్షన్, పైట్స్, కొద్దిగా గ్లామర్ ఉంటాయి. నేను తొలిసారి ఇలాంటి షూటింగ్ లో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.Leave a Reply

Your email address will not be published.