డిసెంబ‌ర్ 6న వ‌స్తున్న‌ `మేరా దోస్త్`


పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై పి .వీరారెడ్డి  నిర్మించిన  `మేరా దోస్త్` ఈ నెల  6న రిలీజ్ అవుతున్న‌ట్టు  చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.  ఫిలిం ఛాంబర్ లో జ‌రిగిన  ప్రెస్ మీట్ లో… చిత్ర  నిర్మాత పి.వీరా రెడ్డి  మాట్లా డుతూ …“చిత్ర నిర్మాణ అనంత‌ర కార్య‌క్ర‌మాల‌న్ని పూర్త‌య్య‌యాని. ఈ నెల  6న దాదాపు 150 థియేటర్స్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామ‌ని చెప్పారు. చిన్న సినిమాగా ఆరంభ‌మైన మా సినిమా  క‌థ‌, చిన్నా మ్యూజిక్ పెద్ద స‌పోర్టు ఇస్తాయ‌ని చెప్పారు. ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమా తీసాన‌ని అన్నారు.  
డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ…“  ఎక్కడా రాజీ పడకుండా  సినిమా నిర్మాణంలో నిర్మాత అన్ని విధాలా స‌హ‌క‌రించార‌ని,   ప్రేమ , ఫ్రెండ్ షిప్ తో పాటు ఫామిలీ ఎమోషన్స్ క‌ల‌గ‌ల‌సిన క‌థ‌తో సినిమా రూపొందిన‌ట్టు చెప్పారు.   మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా “అన్నారు.
హీరోయిన్ శైలజ మాట్లాడుతూ…“ ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర దొరికింది. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాన‌ని,  అందరూ  చూసి బ్లెస్ చేయండి “  అని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published.