‘యమ్‌6’ చిత్రానికి పెరిగిన థియేటర్లు

ధ్రువ, అశ్విని, శ్రావణి హీరోహీరోయిన్లుగా విశ్వనాథ్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై జైరామ్‌వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్‌ తన్నీరు నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘యమ్‌6’. ఈ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు మాట్లాడుతూ ”మా ‘యమ్‌6’ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ చిత్ర కథ, కథనాలు అందర్నీ ఉత్కంఠకు గురి చేస్తాయి. అదే సమయంలో మంచి కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా అప్పలరాజు అనే కొత్త కమెడియన్‌ని పరిచయం చేశాం. సినిమాలో అతని కామెడీ హైలైట్‌గా ఉంటుంది. అప్పలరాజు ఆడియన్స్‌ని విపరీతంగా నవ్విస్తున్నాడు. మా సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌ని బట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరికొన్ని థియేటర్లు పెంచుతున్నాం. అలాగే మా చిత్రాన్ని విడుదల చేసేందుకు కర్నాటకలోని డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తున్నారు. అక్కడ కూడా మా సినిమాని విడుదల చేస్తున్నాం. హారర్‌ కామెడీతోపాటు మంచి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘యమ్‌6’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.