69 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకొండి.! కాంగ్రెస్ చురకలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ని మోడీ స‌ర్కారు త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు యోచిస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ను, ప్ర‌ధానంగా బిజెపి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టడానికి విఫలయత్నం చేస్తోంది. ఆమ‌ధ్య త‌ను భార‌త్ సంద‌ర్శ‌న స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌భ‌కు 6 నుంచి 10 మిలియన్ ల మంది ప్రజలు పాల్గోంటారని ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనతో చెప్పారని ట్రంప్ మీడియాకు చెప్పిన విష‌యాన్ని కాంగ్రెస్ ప‌ట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ, 60 లక్షల నుంచి ఒక కోటి మంది స‌భ‌కు హాజ‌ర‌వుతార‌ట‌.. అంటూ సాగ‌దీత‌లు ఆరంభించింది.

2 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారం ముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారని , ఈ క్ర‌మంలో ఇప్పటికే లక్ష ల ఉద్యోగాలు గాలిలో ఇచ్చేసారంటూ ఎద్దేవా చేసింది . డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సంద‌ర్భంగా ట్రంప్ పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’కార్యక్రమం 69 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఈ 69 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఏర్పాట్లు చేసింద‌ని, 69 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు చిక్కాయని, వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్డీ బీజేపీకి చురకలు అంటిస్తూ ప్రకటన విడుదల చేసింది.


Leave a Reply

Your email address will not be published.