మార్చి 6న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి చిత్ర విడుదల

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై  ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులుగా న‌టించిన ఈ సినిమాకు బాలు అడుసుమిల్లి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన  కొత్త ట్రైలర్  సోమవారం   హైదరాబాద్ లో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మార్చి 6న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక-నిర్మాతలు ప్రకటించారు. 

ఈస‌మావేశంలో దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ “ఇన్ని రోజులు మీడియాలో ఒకడిగా ప‌నిచేసిన నాకు   దర్శకత్వం వహించడం అవ‌కాశం వ‌చ్చింది.  ఈ సినిమాను దర్శకులు అందరికీ   అంకితం చేస్తున్నా. వినోదంతో కూడిన మంచి కథతో సినిమా తీశాన‌ని ఆనందంగా ఉంద‌ని చెప్పారు.   ఈ కార్య‌క్ర‌మంలో ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.