మార్చి 6న రిలీజ్ విడుదల కానున్న‘ఓ పిట్ట కథ’.

భారీ చిత్రాల నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ సంస్థ తొలిసారిగా విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు, నిత్యా శెట్టి లాంటి కొత్త హీరో హీరోయిన్లుని వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. సరికొత్త కంటెంట్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలకపాత్ర పోషిస్తుండగా చెందు ముద్దు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు.
వి.ఆనందప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 6న రిలీజ్ విడుదల చేస్తున్న సందర్భంగా మార్చి 1న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని భారీగా జరపబోతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొబోతుండటం విశేషం.
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మీడియాలో మాట్లాడుతూ మాట్లాడుతూ –‘‘ కేవలం కథను నమ్మి, కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు నెటిజన్ల నుంచి మంచి రెస్సాన్స్ లభిస్తుంటే ఆనందరంవేస్తోంది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా చేయనున్నాం. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో మాలో కొత్త ఉత్సాహం వస్తోంది. ఈ ఫంక్షన్‌కి రావాలని కోరగానే అంగీకరించిన మెగాస్టార్ పెద్ద మనసుకు అభివందనాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువేనని అన్నారాయన.