ఫిబ్రవరి 7న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ విడుదల

బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. . ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులుగా న‌టిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజ‌ర్లు ఇప్ప‌టికే ప్రేక్షకాదరణ పొంది సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.
ఈ చిత్ర విడుద‌ల సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు బాలు అడుసుమిల్లి మీడియాలో మాట్లాడారు. ‘‘వేగి నాయుడుగారి అబ్బాయి శ్రీనివాస్‌తో కలిసి ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి ఆరంభించిన ఈ సినిమా పూ్త‌ర‌య్యింది. ఇప్పటికే వ‌చ్చిన ట్రైలర్, పోస్టర్స్ కి ఆడియ‌న్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంద‌ని అన్నారు. ఈ రెండింటినీ అంత‌లా ఆద‌రించిన ప్రేక్షకులందరికీ థాంక్స్ అని చెప్పారు.
సినిమా క‌థ గురించి మాట్లాడుతూ ఈ మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథ ఇది. వీరు హైదరాబాద్ నుంచి గోవాకి ఓ స్నేహితునాలి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం ళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. కథ, కథనాలు కొత్త తరహాలో ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. న్యూ ఏజ్ సినిమా అని మాత్రం చెప్ప‌గ‌ల‌ను అన్నారు.

Leave a Reply

Your email address will not be published.