7న ఖమ్మంలో సందడి చేయనున్నవెంకీ మామ

ఇప్పటికే వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న ‘వెంకీమామ’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ జోరు పెంచింది. ఈ క్రమంలోనే యుఎస్‌లో 150 షోలని ఖరారు చేసిన యూనిట్ తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు తేదీ సహా వెన్యూ ఫిక్స్ చేసిందని తెలుస్తోంది.
చిత్ర యూనిట్ అందిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ వేదికగా డిసెంబర్ 7 సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ నిర్వహించాలని నిర్మాత సురేష్ బాబు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.