ఫిబ్రవరి 7న వస్తున్న ‘భాగ్యనగరం’

కె.జి.ఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైపోయిన కన్నడ సూపర్ స్టార్ నటించగా  సాధించిన చిత్రం తెలుగులో అనువాదమైంది. కె.వి.రాజు దర్శకత్వంలో ‘రాజధాని’ పేరుతో కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘భాగ్యనగరం’ పేరుతో సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సంతోష్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. యష్ సరసన ‘బిందాస్’ ఫేమ్ షీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో  ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషించగా.. డాన్సింగ్ సెన్సేషన్ ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేసింది. తులసి మరో ముఖ్య పాత్రధారి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న  ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.  
    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘కె.జి.ఎఫ్’ తో ఆలిండియా స్టార్ గా ఎదిగిన యష్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కె.జి.ఎఫ్ కి ఎంత మాత్రం తీసిపోదు. మా సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ కి ఈ చిత్రం కచ్చితంగా చక్కని శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా థియేటర్లలో ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నాం’ అన్నారు!

Leave a Reply

Your email address will not be published.