ఫిబ్రవరి 7న ‘సవారి‘ విడుదల


నందు, ప్రియాంకా శర్మ జంటగా కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మిస్తున్న కి ‘సవారి‘ సినిమా ని నూతన దర్శకుడు సాహిత్ మోత్కూరి రూపొందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న సినిమా విడుదలవుతున్న సంద‌ర్భంగా ప్రి రిలీజ్ ఈవెంట్ హోటల్ దసపల్లా కన్వెన్షన్స్ లో నిర్వ‌హించారు. సవారి’ బిగ్ టికెట్ ను హీరోలు కార్తికేయ, విష్వక్ సేన్ సంయుక్తంగా లాంచ్ చేశారు. ఇద్దరూ రూ. 10 వేలకు టికెట్లను కొనుగోలు చేశారు.

డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ: “ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు. మోనిష్ భూపతిరాజా సినిమాటోగ్రఫీ వల్లే విజువల్స్ బాగా వచ్చాయని ఎడిటర్ సంతోష్ పనితీరు బాగుంద‌ని, శేఖర్ చంద్ర మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌ను మ్యాజిక్‌లో ముంచెత్త‌నుంద‌ని అన్నారు. నందు ఒక అండర్ రేటెడ్ యాక్టర్ అని అనుకుంటున్నా. సీన్ ఇస్తే చింపేసేవోడు. స్క్రీన్ మీద తన పర్ఫార్మెన్స్ అదిరిపోయేలా చేసాడు. తెలంగాణా యాసలో డైలాగ్స్ బాగా చెప్పాడు. నా ‘బందం రేగడ్’లో చేసిన ప్రియాంక ఈ సినిమాతో ఆమెకి మ‌రిన్ని అవ‌కాశాలు రావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. 

‘సవారి’ హీరో నందు మాట్లాడుతూ: “ఫిలిం నగర్ లో సెటిల్ అవనీకి బ్యాగ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. కార్తికేయ, విష్వక్ సేన్ అలా వ‌చ్చిన వారే… వారిదారిలో నాకూ అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమాకి అసలైన హీరో సాహిత్. అసాధారణ స్క్రిప్ట్ రాశాడు. నందులో మంచి యాక్టర్ ఉన్నాడని ఈ సినిమాతో నిరూపించుకునే ఛాన్సు నాకొచ్చింది. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో చూసి స్పందించిన నాగచైతన్య, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, మంచు మనోజ్, సుకుమార్, సురేందర్ రెడ్డి గార్లకు చాలా థాంక్స్.అని చెప్పారు. 

ఈ సంద‌ర్భంగా చిత్రసీమకు చెందిన నిర్మాతలు, రాజ్ కందుకూరి, శరత్ మరార్ , బెక్కెం వేణుగోపాల్, కమెడియన్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , గేయరచయిత కాసర్ల శ్యామ్ , మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర , సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రి రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా విచ్చేసి, ‘సవారి’ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాక్షించారు. 

ఈ కార్యక్రమంలోఈ స‌మావేశంలో హీరోయిన్ ప్రియాంకా శర్మ, హీరో కార్తికేయ హీరో విష్వక్ సేన్ , చిత్రంలో న‌టించిన నటులు వీరేన్ తంబిదొరై, శ్రీకాంత్ రెడ్డి, శివ, జీవన్, బల్వీందర్, మ్యాడీ, టీఎన్నార్, గేయరచయితలు పూర్ణాచారి, రామాంజనేయులు, సింగర్ నోయల్, ఎడిటర్ సంతోష్ మీనం తదితరులు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published.