శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం…

విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభించారు చిత్ర నిర్మాత‌లు.  తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్ ‘అసురన్‌’ చిత్రానికి  రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా  శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వ‌హిస్తున్నారు.  పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం తొలి షాట్‌ని  విక్ట‌రీ వెంక‌టేష్ పై చిత్రీక‌రించారు.
ఇక ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం టైటిల్‌ని  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్ ని సామాజిక మీడియాలో విడుద‌ల చేసారు నిర్మాత ద‌గ్గుబాటి సురేష్. పూర్తి మాస్‌ గెటప్‌లో వైవిధ్యంగా వెంక‌టేష్ క‌నిపించిన ఈ పోస్ట‌ర్లులో ‘నారప్ప’ గెటప్‌లో  అదిరేలా ఉన్నాయి.  ఈ మొదటి షెడ్యూల్‌లో  రాయలసీమ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంఅనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్‌ లొకేషన్లలో ‘నారప్ప’ కీలక సన్నివేశాలను పూర్తి చేయ‌నున్న‌ట్టు ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.